Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కోసం కోట్లు కోట్లు పెడుతోంది.. ఎవరో తెలుసా?

ప్రముఖ గాయని, నటి సెలీనాకు కోట్లు కోట్లు కుమ్మరిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు అంటే లైకులు, కామెంట్లు, షేరింగ్‌ల కారణంగా సెలీనా కోట్లు ఖర్చు పెడుతోంది. ఒక్కో పోస్టుకు వేలల్లో కాదు లక్షల్లో కాదు ఏకంగ

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (11:39 IST)
ప్రముఖ గాయని, నటి సెలీనాకు కోట్లు కోట్లు కుమ్మరిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు అంటే లైకులు, కామెంట్లు, షేరింగ్‌ల కారణంగా సెలీనా కోట్లు ఖర్చు పెడుతోంది. ఒక్కో పోస్టుకు వేలల్లో కాదు లక్షల్లో కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెడుతోంది. సెలీనాకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వుంది. గాయనిగా, నటిగా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. అలాగే సెలీనాకు 141.5 మిలియన్ ఫాలోవర్స్‌ వున్నారు. 
 
ఈ ఫాలోవర్స్ అంతా సెలీనా పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆమె ఒక్క పోస్ట్‌ చేస్తే చాలు లక్షల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి పడుతుంటాయి. సెలీనా పెట్టే పోస్టులపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. బడా కంపెనీలు దృష్టి సారించాయి. సెలీనా ఏదైనా పోస్టు పెడితే విపరీతంగా ప్రచారం జరగడంతో దాన్నిక్యాష్ చేసుకునేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి.
 
ఇన్‌స్టాగ్రామ్‌లో సెలీనా తమ కంపెనీకి సంబంధించి పోస్ట్ చేస్తే అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సెలీనా ప్రముఖ జర్మన్ కంపెనీ అయిన ప్యూమాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. సెలీనా పెట్టే ఒక్కో పోస్ట్‌కు 3.5 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకుంటుంది. అంటే మన కరెన్సీలో 24 కోట్ల 75 లక్షల రూపాయలు. ప్యూమా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, షూస్‌ వేసుకుని సెలీనా దిగిన ఫొటోలకు లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. 
 
అయితే ప్యూమా నుంచి సెలీనా తీసుకునే పారితోషికంలో కొంతభాగం ఓ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌కు విరాళంగా ఇస్తోంది. రెండేళ్ల క్రితం సెలీనాకు ల్యూపస్‌ వ్యాధి సోకింది. దాంతో ఆమెకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. మృత్యువుతో పోరాడిన సెలీనాను ఆమె స్నేహితురాలు హాలీవుడ్ నటి ఫ్రాన్సియా రైజా కాపాడారు. ఒక కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు. తనలా ఈ వ్యాధితో ఇంకెవరూ బాధపడకూడదని, మెరుగైన ఔషధాలు తయారుచేసేందుకు పరిశోధనలు చేస్తున్న సంస్థలకు సెలీనా విరాళాలు ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments