belly fat: దాల్చిన చెక్కతో తగ్గిపోతుందా?

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:45 IST)
చాలామంది పొట్ట వచ్చి వికారంగా కనిపిస్తుంటారు. అలాంటి వారు బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును తగ్గించాలనుకుంటే, రోజువారీ ఆహారాలలో దాల్చినచెక్కను జోడించడం ప్రారంభించాలి. దాల్చినచెక్క ఆకలిని అణచివేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. అలాగే జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని రోజూ రెండుసార్లు ఆహారం తరువాత అర గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
 
పావు కప్పు ఆలివ్ నూనెను వేడిచేసి మూడు స్పూన్ల తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వారానికి ఒకటి రెండు సార్లు ఈ విధంగా చేయాలి.
 
దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం అరచెంచా పొడిని పావు గ్లాసు నీరు లేదా పాలల్లో కలిపి తాగడం వల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
 
ఒక గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబూ, దగ్గు తగ్గుతాయి.
 
ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి, రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగుతుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి తీసిన గంధాన్ని పట్టిస్తుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments