Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చ కర్పూరంతో శృంగార సామర్థ్యం... ఇలా చేస్తే...

కర్పూరాన్ని పూజా ద్రవ్యంగా భావించి వెలిగించడం ఆచారమైనప్పటికీ, తద్వారా క్రిమికీటకాదులు దరిచేరవని పెద్దలు చెపుతారు. కర్పూరం కేవలం పూజాద్రవ్యమే కాదు. ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదించే మహత్తర శక్తివంతమైన ఔషధ గుణాలను నిక్షిప్తం చేసుకుని, పలురకాల ఆరోగ్య సమస్యలకు

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (20:13 IST)
కర్పూరాన్ని పూజా ద్రవ్యంగా భావించి వెలిగించడం ఆచారమైనప్పటికీ, తద్వారా క్రిమికీటకాదులు దరిచేరవని పెద్దలు చెపుతారు. కర్పూరం కేవలం పూజాద్రవ్యమే కాదు. ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదించే మహత్తర శక్తివంతమైన ఔషధ గుణాలను నిక్షిప్తం చేసుకుని, పలురకాల ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపే ఆరోగ్యప్రదాత కూడా.
 
1. ఆవనూనెను వేడిచేసి, నాలుగవ వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి నిలువ ఉంచుకుని, తొడలు, ఉదరం మొదలైన భాగాల్లో మర్దనా చేస్తుంటే ఆయా భాగాల్లో సంచితమైన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. రొమ్ములపై గడ్డలున్న చోట మర్దనా చేస్తుంటే కొన్ని విధాలైనా గడ్డలు కరిగిపోతాయి.
 
2. పాదాలు, అరచేతుల చర్మం బిరుసెక్కి పగుళ్లతో బాధపడేవారు, కొబ్బరినూనెలో పసుపు, కర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
 
3. అరగ్లాసు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు, కలరా వ్యాధి తగ్గుతాయి. అంతేకాకుండా నీరసం, నిస్త్రాణ కూడా తగ్గుతాయి.
 
4. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక సంభోగం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
 
5. మిరియాలు, కర్పూరం, నల్ల జీలకర్ర పొడి, ఏలుకల చూర్ణాలను సమానంగా కలిపి ముక్కుపొడుంలా పీలుస్తుంటే, ముక్కు, సైనస్ తదితరభాగాల్లో సంచితమైన శ్లేష్మమంతా సులువుగా బయటకు వెళ్లి ముక్కుదిబ్బడ, తలబరువు, తలనొప్పి వంటి బాధలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం