Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ ప్రిన్స్‌ విహార నౌకలో 66 మందికి కరోనా వైరస్...

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (10:17 IST)
జపాన్ దేశానికి చెందిన క్రూయిజ్ షిప్‌లో ఉన్న 66 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నిరూపితమైంది. దీంతో వారందనీ నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 3,700 మంది ఉండగా, వారిలో 1100 మంది సిబ్బంది. టోక్యో నగరానికి దక్షిణంగా ఉన్న యోకోహామా సమీపంలోని సముద్రంలోనే నిలిపి కరోనా వైరస్ ప్రబలకుండా చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఓడలో నుంచి హాంకాంగ్‌లో దిగిన ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఓడలోని వారందరినీ రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచారు. ఓడలో నిర్బంధంలో ఉన్నవారిలో 39 మందికి కరోనావైరస్ సోకగా వారిలో 10 మంది జపాన్ దేశస్థులున్నారు. మరో 10 మంది ఓడ సిబ్బంది. మిగతా రోగులు అమెరికా, చైనా దేశాలకు చెందిన వారని జపాన్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. 
 
నౌకలోని ప్రయాణికులను క్యాబిన్లలోనే ఉంచి మాస్కులు ఇచ్చి చికిత్స చేస్తున్నారు. వ్యాధి తగ్గితే ఈ నెల 19వ తేదీన ఓడ నుంచి వారిని విడుదల చేయాలని జపాన్ వైద్యాధికారులు యోచిస్తున్నారు. మరోవైపు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ సింగపూర్ దేశానికి వ్యాపించడంతో ఆ దేశంలో పర్యటించవద్దని పలు దేశాలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments