Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌ భార్యకు, కుమార్తెకు పోరు జరుగుతుందా? కారణం ఏంటి?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:29 IST)
ivanka_melania
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌కు, ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు మెలానియా మూడో భార్య కాగా.. అమెరికాలో ఫస్ట్ లేడీ గౌరవాన్ని ఆమె దక్కించుకున్నారు. ఆమె కోసం వైట్‌హౌస్‌లో ఓ ప్రత్యేక కార్యాలయమే ఉంటుంది. మరో ఐదు నెలల్లో ట్రంప్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తన కుమార్తె ఇవాంక నుంచి ట్రంప్‌కు చిక్కులు వస్తున్నట్టుగానే ఉన్నాయి. ఇందుకు మెలానియా జీవిత చరిత్ర పుస్తకం ఆజ్యం పోస్తోంది. 
 
'వాషింగ్టన్ పోస్ట్ 'రిపోర్టర్ మేరీ జోర్డాన్ , మెలానియా ట్రంప్ జీవితకథతో 'ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ ' పేరిట పుస్తకం రాసి విడుదల చేశారు. ఈ పుస్తకం గురించి మేరీ జోర్దాన్ మాట్లాడుతూ.. ' తన తల్లికి దక్కాల్సిన ఫస్ట్ లేడీ టైటిల్‌ను సవతితల్లి అయిన మెలానియా అనుభవించడం ఏంటని ఇవాంకా ప్రశ్నించారు. 
 
అంతేకాదు 'ఫస్ట్ లేడీస్ ఆఫీస్' పేరును 'ఫస్ట్ ఫ్యామిలీస్ ఆఫీస్' గా మార్చేందుకు ఆమె ప్రయత్నించారు. అయితే , ఇవాంకా ప్రయత్నాలను మెలానియా సమర్థవంతంగా అడ్డుకున్నారు. ప్రస్తుతం ట్రంప్‌కు మెలానియా సింగిల్ మోస్ట్ ఇన్ ఫ్లూయన్షియల్ అడ్వయిజర్' అని జోర్డాన్ తెలిపారు. కాగా , ఈ పుస్తకం ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చింది. కానీ ఈ పుస్తకంలో అవాస్తవాలే ఎక్కువ వున్నాయని ఇవాంకాకు మద్దతిచ్చేవారు ఆరోపిస్తున్నారు. మరి ఈ పోరు ఏ వివాదానికి దారి తీస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments