Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను మించిన కొత్త వైరస్... 24 గంటల్లో ముగ్గురి మృతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (13:19 IST)
ప్రపంచలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత అనేక రకాలైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ వేరియంట్ వైరస్‌లు సోకిన వారిలో పలువురు మృత్యువాతపడుతున్నారు. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా ఆఫ్రికా దేశాల్లో వైద్యులకే అంతు చిక్కని విధంగా, కరోనాను మించిన కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. గత 24 గంటల్లో ఈ వైరస్ సోకిన వారిలో ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 
 
ఈ వైరస్ బారినపడినవారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు స్థానిక వైద్యులు వెల్లడించారు. ఇదేసమయంలో ఈ వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని తెలిపారు. నిజంగానే ఇది ఆందోళన కలిగించే విషయమని వారు తెలిపారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బురుండి దేశ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలావంటే, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బురిండి సమీప దేశాలకు హెచ్చరికలు చేసింది. కొత్త వైరస్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. కాగా, ఇటీవల బురిండి పక్కదేశమైన టాంజానియాలో మార్‌బర్గ్ అనే కొత్త వైరస్ వెలుగు చూసిన విషయం తెల్సిందే. దీంతో ఇదే వైరస్ బురిండిలో కూడా వ్యాపించిందా అనే సందేహం కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments