Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బ.. 2022 నాటికి 7లక్షల ఉద్యోగాలు గోవిందా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్‌పై వేటు వేయడంతో పాటు వీసాలపై కొరడా ఝుళిపించడంతో భారత ఐటీ నిపుణులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో 2021 నా

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (18:37 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్‌పై వేటు వేయడంతో పాటు వీసాలపై కొరడా ఝుళిపించడంతో భారత ఐటీ నిపుణులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో 2021 నాటికి 6.4 లక్షల ఐటీ ఉద్యోగులు తమ కొలువు కోల్పోతారని అంచనా వేసింది. దీంతో ఐటీ నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి రోబోటిక్ ప్రోసెస్ ఆటోమేషన్ కారణమని సదరు సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది. 
 
అమెరికా కేంద్రంగా పనిచేసే హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోతారని పేర్కొంది. అయితే ఉన్నత, మధ్య స్థాయి ఉద్యోగులు లక్ష నుంచి 1.9లక్షలకు పెరిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొన్నారు. 
 
ఆటోమేషన్ వల్ల ఉన్నత స్థాయి నైపుణ్యాల ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపింది. ఈ క్రమంలో అంచనాలు సవరిస్తే.. 2022 నాటికి ఏడు లక్షల ఉద్యోగాలు ఊడుతాయని సంస్థ షాక్ ఇచ్చింది. లోస్కిల్స్ కారణంగా ఐటీ ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఎక్కువగా వుందని సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.
 
ఆటోమేషన్‌పై ఖర్చూ చేస్తే మ్యాన్ పవర్ తగ్గించేందుకు ఐటీ సంస్థలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో కంపెనీలు కోతలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమేషన్ ఎఫెక్ట్ మొదలైంది. హైదరాబాదులో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు తగ్గాయి. 
 
ఖర్చు తగ్గించుకునే దిశగా ఐటీ సంస్థలు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఎంట్రీ లెవల్‌పై తీవ్ర ప్రభావం పడింది. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలో ఇప్పటికే ఆటోమేషన్ ట్రైనింగ్ ప్రారంభమైంది. దీంతో హైదరాబాదుతో పాటు భారతీయ ఐటీకి కష్టాలు తప్పవని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments