Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారా స్థాయికి ఆహార సంక్షోభం... తిండికోసం అల్లాడుతున్న పాక్ ప్రజలు

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (09:37 IST)
పాకిస్థాన్ దేశంలో ఆహార సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. దీంతో ఆ దేశ ప్రజలకు పూట గడవడం గగనంగా మారింది. ఫలితంగా పాక్ ప్రజలు తిండి కోసం అల్లాడిపోతున్నారు. గోధుమ పిండి లోడుతో వెళుతున్న ట్రక్‌ను వందలాది మంది ప్రజుల ఛేజ్ చేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలకు తెగించి ఆ ట్రక్కు వెనుకభాగంలో ఎక్కడం వీడియోలో కనిపిస్తుంది. ఇది ఆ దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ప్రొఫెసర్ సజ్జద్ రాజా షేర్ చేశారు. 
 
ఇది బైక్ ర్యాలీ కాదు. గోధుమ పిండి కోసం పాక్ ప్రజలు పడుతున్న కష్టాలకు ఇది నిదర్శనమన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. తాను పాకిస్థానీ కానందుకు సంతోషిస్తున్నట్టు చెప్పారు. పాకిస్థాన్‌‍తో భవిష్యత్ ఉందని ఇప్పటికీ భావిస్తున్నారా? అని ఆయన ఆ ట్వీట్‌లో జమ్మూకాశ్మీర్ ప్రజలను ప్రశ్నించారు. 
 
కాగా, పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం రోజురోజుకు ముదురుతుండడంతో భద్రతా దళాల పర్యవేక్షణలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం రాయితీపై అందించే గోధుమ పిండి కోసం ఖైబర్ ఫక్తుంఖ్వా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిల్చుంటున్నారు. 
 
ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు గోధుమపిండినే ఆహారంగా ఉపయోగిస్తారు. కాగా, పాకిస్థాన్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. మరోవైపు, పాక్‌లో విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments