Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. ఆస్ట్రేలియా కఠిన నిర్ణయం.. ఏంటది?

Webdunia
శనివారం, 1 మే 2021 (10:57 IST)
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశం నలుమూలలా వైరస్ విరుచుకుపడుతోంది. మునుపెన్నడూ లేనంత ఉధృతితో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి.
 
ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్ లోనే చోటు చేసుకోవడం పరిస్థతి తీవ్రతను తెలుపుతోంది. గత 24 గంటల్లో శుక్రవారం.. 4,01,993 కేసులు నమోదయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ఠ్యా విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో 14 రోజులు ఉండి ఆస్ట్రేలియా వచ్చే తమ పౌరులకు 5 ఏండ్లు వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. 
 
బయోసెక్యూరిటీ యాక్ట్ కింద ఆస్ట్రేలియ చర్యలు చేపట్టింది. స్వదేశీ పౌరులపై ఈ తరహా కఠినమైన ఆంక్ష విధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మూడు వారాల క్రితమే తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం