Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ భూగర్భ రైలులో బాంబు పేలుళ్లు.. ఎవరి పని?

బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్‌లోని అండ‌ర్‌గ్రౌండ్ రైల్లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది వరకు ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. ప‌శ్చిమ లండ‌న్‌లోని పార్స‌న్స్ గ్రీన్ స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోల

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (15:24 IST)
బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్‌లోని అండ‌ర్‌గ్రౌండ్ రైల్లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది వరకు ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. ప‌శ్చిమ లండ‌న్‌లోని పార్స‌న్స్ గ్రీన్ స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసుల‌తోపాటు అంబులెన్స్‌, పారామెడికోలు వెళ్లారు. 
 
రైలు వెనుక‌భాగంలో ఉన్న కంటైన‌ర్‌లో ఈ పేలుడు జ‌రిగింది. దీంతో వెంట‌నే అండ‌ర్‌గ్రౌండ్ ట్యూబ్ నుంచి ప్ర‌యాణికుల‌ను పంపించేశారు. దీనిపై ట్రాన్స్‌పోర్ట్ ఫ‌ర్ లండ‌న్ స్పందిస్తూ, ఎర్ల్స్ కోర్ట్‌, వింబుల్డ‌న్ మ‌ధ్య స‌ర్వీసుల‌ను రద్దుచేసిన‌ట్లు తెలిపింది.
 
అయితే, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లండన్ భూగర్భ రైలులోకి బాంబులు ఎలా చేరాయన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొత్తం రెండు బాబులను అమర్చగా, వాటిలో ఒకటి పేలింది. మరో బాంబును భద్రతా సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రాణనష్టం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments