Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ చోరీ చేసిన వ్యక్తితో ప్రేమలోపడిన యువతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 27 జులై 2023 (09:10 IST)
ప్రేమ గుడ్డిదని పలువురు అంటుంటారు. ఈ మాటలు కొన్ని సందర్భాల్లో నిజమనిపిస్తాయి. తాజాగా తన మొబైల్ ఫోనును చోరీ చేసిన ఓ వ్యక్తితో ఓ యువతి ప్రేమలోపడి ఏకంగా మూడు ముళ్లు వేయించుకుంది. ఈ విచిత్ర ప్రేమ కథ బ్రెజిల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి రాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రేమ జంట తమ ప్రేమను పరిచయం చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా, దీనిని వేలాది మంది చూశారు. అయితే, ఈ ప్రేమ జంట పేర్లు తెలియకపోయినప్పటికీ.. తమ ప్రేమ గురించి ఆ యువతి మాట్లాడుతూ, 
 
'నేను అతను (దొంగ) నివసించే వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నానని, దురదృష్టవశాత్తు అతను నా ఫోన్ లాక్కుపోయాడు' అని ఆమె తెలిపింది. మరోవైపు, ఫోనులో ఆమె ఫోటో చూడగానే తన మనసు మారిందని సదరు దొంగ తన ప్రేమకథను చెప్పాడు. తనకు జీవితంలో ఏ అమ్మాయి తోడు లేదని, తాను క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పాడు. అందుకే ఫోనులో ఆమె ఫోటో చూడగానే మనసు మారిందని, అమ్మాయి ఫోను దొంగిలించినందుకు బాధపడ్డానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 
 
ఆ వీడియోలో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి.. మొదట ఆమె ఫోనును.. ఆ తర్వాత ఆమె మనసు దొంగిలించావ్ అని సరదాగా అడగగా.. అవును అని దొంగ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరు రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరి ప్రేమ కథపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వింత ప్రేమ కథలు బ్రెజిల్‌‌లోనే పుడతాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments