Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంబోడియాలో ఓ ఆవు దూడను పెళ్లాడిన 74 ఏళ్ల వృద్ధురాలు.. ఎందుకో తెలుసా?

కంబోడియాలో ఓ ఆవు దూడను 74ఏళ్ల వృద్ధురాలు వివాహం చేసుకుంది. తద్వారా ఆ వృద్ధురాలు, ఆవుదూడ పెళ్ళి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కంబోడియాలోని క్ర‌టీ ప్రావిన్స్‌కు చెందిన ఖిమ్ హ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (18:39 IST)
కంబోడియాలో ఓ ఆవు దూడను 74ఏళ్ల వృద్ధురాలు వివాహం చేసుకుంది. తద్వారా ఆ వృద్ధురాలు, ఆవుదూడ పెళ్ళి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కంబోడియాలోని క్ర‌టీ ప్రావిన్స్‌కు చెందిన ఖిమ్ హాంగ్(74) భర్త కొన్ని రోజుల క్రితం మరణించాడట. ఖిమ్ వృద్ధురాలి భర్త మరణించాక.. ఓ ఆవు దూడ జన్మించిందట. ఇక దూడ పుట్టిన కొన్ని రోజుల తర్వాత అప్పడప్పుడు ఇంట్లోకి వస్తుండేదట.  
 
ఆ దూడ  అచ్చం తన భ‌ర్త చేసే ప‌నుల్లాగ‌నే ఆ దూడ కూడా చేయడంతో.. తన భర్తే మళ్లీ ఆవు దూడ రూపంలో పుట్టాడని నమ్మి.. దాన్ని ఖిమ్ వివాహం చేసుకుంది. ఈ విషయం మెల్లమెల్లగా జనాలకు తెలియడంతో దాన్నిచూసేందుకు జనాలు భారీగా తరలి వస్తున్నారట. 95 శాతం బౌద్ధులు ఉండే కంబోడియా దేశంలో చ‌నిపోయిన వారు మ‌ళ్లీ ఏదో ఒక రూపంలో పుడ‌తార‌ని నమ్ముతారు.
 
ఇక‌.. త‌న భ‌ర్తే మ‌ళ్లీ పునర్జనించాడ‌ని ఆ దూడకు ఓ ఇల్లు కట్టించి.. సపరేటుగా ఆహారాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఆవుదూడ నిద్రించేందుకు ఓ పడకను కూడా సిద్ధం చేసింది. త‌న భ‌ర్త ఉప‌యోగించిన పరుపు, దుప్ప‌టినే దానికి ఇచ్చింద‌ట. ఈ వృద్ధురాలి స్టోరీనే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments