Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కొత్త ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు.. అదే జరిగితే అంతే సంగతులు

భారత్-బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు డ్రాగన్ కంట్రీ చైనా సమాయత్తమవుతోంది. ఈ

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (07:33 IST)
భారత్-బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు డ్రాగన్ కంట్రీ చైనా సమాయత్తమవుతోంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా రికార్డులకెక్కుతుంది.

ఈ  ప్రాజెక్టు నిర్మాణం కోసం కిలోమీటర్‌కు రూ.976 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇక కరువుతో అల్లాడిపోతున్న జింజియాంగ్ ప్రాంతానికి బ్రహ్మపుత్ర నీటిని తరలించి సస్యశ్యామలంగా మార్చాలని భావిస్తోంది. ఈ క్రమంలో వెయ్యి కిలోమీటర్ల పొడవైన  సొరంగాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
 
కాగా.. టిబెట్-జింజియాంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిన చైనా ఇంజనీర్లు ప్రభుత్వానికి మార్చిలోనే అందజేశారని సమాచారం. అప్పట్లో ఖర్చుకు వెనకాడి వెనక్కి తగ్గిన చైనా.. ఇప్పటికిప్పుడు ఈ  ప్రాజెక్టును అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే ఈ  ప్రాజెక్టును తప్పకుండా నిర్మించి తీరాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాజెక్టును నిర్మించే అవకాశాలున్నాయని చైనా ప్రభుత్వాధికారుల సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments