Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ జాంగ్ ఉన్ ఇకలేరా? డ్రాగన్ కంట్రీ వైద్య బృందం ఏం చెప్పింది?

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:37 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చనిపోయినట్టే తెలుస్తోంది. గుండెకు చేసిన ఆపరేషన్ వికటించడం వల్ల ఆయన మృతి చెందినట్టు వదంతులు వస్తున్నాయి. వీటిని ఉత్తర కొరియా ధృవీకరించడం లేదు. పైగా, సౌత్ కొరియా మాత్రం ఈ వార్తలు కొట్టిపారేస్తోంది. కిమ్ చనిపోలేదని, జీవించేవున్నట్టు తెలిపింది. కానీ, ఉత్తర కొరియా నమ్మినబంటు, మిత్రదేశమైన చైనా మాత్రం నోరు విప్పడం లేదు కదా, తమ దేశ వైద్య బృందాన్ని నార్త్ కొరియాకు పంపించింది. ఈ బృందం కిమ్‌ను పరీక్షించి, చనిపోయారనే సమాచారాన్ని చైనాకు చేరవేసినట్టు వినికిండి. కానీ, డ్రాగన్ కంట్రీ కూడా స్పష్టత ఇవ్వడం లేదు. 
 
కిమ్‌ అనారోగ్యానికి గురయ్యాక.. చైనా తమ దేశ వైద్య నిపుణుల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. ఆ బృందం కిమ్‌ను పరీక్షించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కిమ్ ఇకలేరన్న వార్త నిజమేననే వాదనలు చైనా నుంచి వినిపిస్తున్నాయి. జపాన్‌ మీడియా కూడా ఆయన చనిపోయారని చెబుతోంది. 
 
అదేసమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు ప్రసారం చేస్తోంది. ధూమపానం వల్ల, పరిపాలనాపరమైన ఒత్తిళ్ల వల్ల కిమ్‌ బరువు పెరిగారని, ఆయనకు కార్డియోవాస్క్యులర్‌ శస్త్రచికిత్స జరిగిందని చెబుతోంది. ఆ తర్వాత కిమ్‌ బ్రెయిన్‌డెడ్‌ బారిన పడ్డారనే వార్తలు కూడా ప్రసారమవుతున్నాయి. 
 
మరోవైపు, ఉత్తరకొరియాలో తిరుగుబాటుదారులు తమకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కిమ్‌ చనిపోయారని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ఈ వార్తలను కొట్టిపారేశారు. దక్షిణ కొరియా కూడా కిమ్‌ చనిపోలేదని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments