Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ పెట్టుకోలేదు.. ఫ్లైట్‌ సీటులో మూత్ర విసర్జన.. 20 ఏళ్ల జైలు ఖాయమా?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (08:26 IST)
విమానంలో మాస్క్ పెట్టుకోకుండా వింత ప్రవర్తన చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుంది. అంతేగాకుండా రూ.2కోట్ల రూపాయల జరిమానా కూడా పడింది. వివరాల్లోకి వెళితే.. కొలరాడోకి చెందిన 24 ఏళ్ళ లాండన్‌ గ్రియర్‌. ఆలాస్కా ఎయిర్‌లైన్‌ ఫ్లైట్‌లో మార్చి 9న ప్రయాణించాడు. ఈ వ్యక్తిని విమాన సిబ్బంది మాస్క్‌ పెట్టుకోమని పదేపదే కోరారు.
 
గ్రియర్‌ నిద్రపోతున్న నటిస్తూ, మాస్క్‌పెట్టుకోమని పదే పదే విజ్ఞప్తి చేసినా, వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంతేకాకుండా ఫ్టైట్‌లోనే తన సీటుపైనే మూత్రవిసర్జన చేసి అసహ్యంగా ప్రపవర్తించడంతో తోటి ప్రయాణీకులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో విమానం ల్యాండ్‌ అయిన అనంతరం 24 ఏళ్ళ లాండన్‌ గ్రియర్‌ను ఎఫ్‌బిఐ అరెస్టు చేసింది. డెన్వర్‌లోని జిల్లా కోర్టులో కేసు ఫైల్‌ చేశారు. 
 
గ్రియర్‌ సీటెల్‌ నుంచి డెన్వర్‌కి ఫ్లైట్‌ ఎక్కే ముందు మూడు నుంచి నాలుగు బీర్లను తాగానని ఎఫ్‌బిఐ ఏజెంట్లతో చెప్పారు. విమాన సిబ్బందిని కొట్టినట్టు తనకు గుర్తు లేదని, తాను మూత్ర విసర్జన చేసిన సంగతి కూడా తనకు తెలియదని గ్రియర్‌ చెప్పుకొచ్చాడు. 
 
ప్రస్తుతం పదివేల డాలర్ల పూచీకత్తుతో గ్రియర్‌ విడుదలయ్యాడు. విమాన సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అభియోగాలతో అరెస్టయిన ఈ తాగుబోతు నేరం రుజువైతే, గరిష్టంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే దాదాపు రెండు కోట్ల జరీమానా విధించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments