Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్ అధ్యక్షుడికి చేదు అనుభవం.. చేయి కలుపుతూ చెంపదెబ్బ (video)

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (17:47 IST)
France president
ఫ్రాన్స్ అధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురైంది. మాక్రాన్‌ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ఆగ్నేయ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో మాక్రాన్‌కు పరాభవం తప్పలేదు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు క‌దులుతున్న ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చేయి క‌లిపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. మాక్రాన్ చేయి అందించాడు. 
 
ఆ వ్య‌క్తి మాక్రాన్‌తో చేయి క‌లిపిన‌ట్లుగానే క‌లిపి చెంప‌పై ఒక్క‌టిచ్చాడు. ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌కు అధ్యక్షుడుతో పాటు అక్క‌డున్న వారంతా షాక్ గుర‌య్యారు. అయితే ప‌క్క‌నే ఉన్న మాక్రాన్ అంగరక్షకులు వెంట‌నే స్పందించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సమాజిక మధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆకుపచ్చ రంగు టీ షర్టు, కళ్లజోడు, మాస్కు పెట్టుకున్న ఓ వ్యక్తి 'డౌన్​ విత్ మేక్రోనియా' అని అరుస్తూ మేక్రాన్​ చెంప చెళ్లమనిపించిన దృశ్యాలు కనిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments