Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఉంపుడుగత్తెల్లో భారతీయ మహిళలే ఎక్కువ : ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మరోమారు తన మాజీ భర్తను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఇందులోభాగంగా, ఇమ్రాన్‌కు ఉన్న అక్రమ సంబంధాలపై గళం విప్పారు. ఇమ్రాన్ ఖాన్ "

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (12:23 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మరోమారు తన మాజీ భర్తను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఇందులోభాగంగా, ఇమ్రాన్‌కు ఉన్న అక్రమ సంబంధాలపై గళం విప్పారు. ఇమ్రాన్ ఖాన్ "టెల్ ఆల్" అనే పేరుతో రాసిన ఆత్మకథ పుస్తకంలోని అనేక వివాదాస్పద అంశాలపై ఆమె స్పందించారు.
 
ఇమ్రాన్ ఖాన్‌కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ గతంలో తనకు చెప్పారని, ఆయన మొదటి భార్య జెమ్మిమా గోల్డ్ స్మిత్‌కు కూడా ఈ సంగతి తెలుసన్నారు. 
 
ఇమ్రాన్‌కు, సితా వైట్‌కు జన్మించిన టైరియన్ వైట్ గురించి గతంలో తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన సమయంలో, టైరియన్ వైట్ ఒక్కతే కాదని, తనకు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని చెప్పారని ఆమె వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఇమ్రాన్‌కు దేశ ప్రధానమంత్రి కావాలన్న కోరిక బలంగా ఉండేదనీ, పైపెచ్చు.. ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే, ఇమ్రాన్‌కు ఇతర దేశాల కంటే భారతీయ మహిళలతోనే ఎక్కువగా అక్రమ సంబంధాలు ఉన్నాయని రెహమ్ ఖాన్ ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments