భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (12:08 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాకిస్థాన్‌కు చెందిన 16 మంది యూట్యూబ్ చానెళ్లపై నిషేధం విధించింది. వీటిలో డాన్, సామా టీవీ, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, ఆష్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తార్ సునో న్యూస్, పాకిస్థాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి చానళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి సుమారుగా 6.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
 
పహల్గాం దాడి ఘటన తర్వాత ఈ చానళ్లు భారత్‌పై విషం కక్కుతున్నాయి. రెచ్గొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత భారత్, భారత సైన్యం, భద్రతా సంస్థలను రెచ్చగొట్టేల ఇవి వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అలాగే, సున్నితమైన కంటెంట్‌పై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

సిద్ధు గారూ, మీరు నిజ జీవితంలో ఉమనైజరా?: లేడీ జర్నలిస్ట్ ప్రశ్న, ఎక్కడికి పోతున్నారు? (video)

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం