Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మమ్మలను ఏం చేయలేదు.. దౌత్యపరంగా పాక్ ఏకాకి కాలేదు: సర్తాజ్ అజీజ్

భారత్ మమ్మలను ఏం చేయలేదనీ, అలాగే, దౌత్యపరంగా ప్రపంచంలో తాము ఏకాకి కాలేదనీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (17:35 IST)
భారత్ మమ్మలను ఏం చేయలేదనీ, అలాగే, దౌత్యపరంగా ప్రపంచంలో తాము ఏకాకి కాలేదనీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ సర్జికల్ దాడులు జరిపిన విషయం తెల్సిందే. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ భారత్‌తో తాము దొడ్డిదారి సంబంధాలు కావాలనుకోవడం లేదన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో తెరచాటున ఏమీ జరగడం లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాలు అటువంటి సంబంధాలను కోరుకుంటే అది జరగబోవన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఎప్పుడూ పాకిస్థాన్‌ను వేలెత్తి చూపుతోందని మండిపడ్డారు.
 
ముఖ్యంగా భారత్‌లో ఏ చిన్నపాటి దాడి జరిగినా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై నిందలు మోపడం రివాజుగా మారిపోయిందన్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు నిలిచిపోయిన మాట నిజమేనన్నారు. పాక్ సరైన దిశలోనే ముందుకు వెళ్తోందని, దౌత్యపరంగా పాక్ ఏకాకి కాలేదని స్పష్టం చేశారు. చైనాతో పాక్‌కు సత్సంబంధాలు పెరుగుతుండడం ఇతర దేశాలకు కంటగింపుగా మారిందని అజీజ్ అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments