Webdunia - Bharat's app for daily news and videos

Install App

"యూ.. బ్లడీ బ్లాక్‌ ఇండియన్స్" ఆస్ట్రేలియాలో భారతీయుడిపై విద్వేష దాడి

అమెరికాలో నివశించే భారత పౌరులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్న తరుణంలో ఆస్ట్రేలియా కూడా ఇదే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (08:44 IST)
అమెరికాలో నివశించే భారత పౌరులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్న తరుణంలో ఆస్ట్రేలియా కూడా ఇదే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో నివశించే ఓ భారతీయుడిపై దాడి జరిగింది. యూ... బ్లడీ బ్లాక్ ఇండియన్స్ అంటూ బూతులు తిడుతూ విద్వేషపూరిత దాడికి దిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కేరళకు చెందిన లీ మాక్స్‌ జాయ్‌ అనే వ్యక్తి నార్త్‌హోబర్ట్‌లో నర్సింగ్‌ చదువుతూ... పార్ట్‌టైమ్‌ టాక్సీ డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు కాఫీ తాగేందుకు స్థానిక మెక్‌డోనాల్డ్స్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ నలుగురు యువకులు, ఒక యువతి రెస్టారెంట్‌ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 
 
అంతలో వారి దృష్టి పార్కింగ్‌ వద్ద ఉన్న జాయ్‌‌పై మళ్లింది. అంతే.. ‘యూ బ్లడీ బ్లాక్‌ ఇండియన్స్‌’ అంటూ అతడిపై జాతివివక్షతో కూడిన దూషణలు చేశారు. రెస్టారెంట్‌లోనివారు పోలీసులకు ఫోన్‌ చేయడం గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత వచ్చి జాయ్‌పై దాడి చేసి కొట్టారు. రక్తమోడుతున్న జాయ్‌ను రాయల్‌ హోబర్ట్‌ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు కాట్‌ స్కాన్‌, ఎక్స్‌రే చేసి ఇంటికి పంపారు.
 
అమెరికాలో ఇటీవల హైదరాబాద్‌కు చెందిన టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లపై జరిగిన దాడి ఘటనను మరచిపోకమందే ఆస్ట్రేలియాలో ఈ తరహా దాడి జగడం ఆయా దేశాల్లో ఉన్న భారత పౌరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడ ఎన్నారైలు ఆందోళన చెందుతుండగా... ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని ఇక్కడ వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments