కాలేజీ విద్యార్థిని అత్యాచారం కేసులో భారతీయుడికి సింగపూర్ కోర్టు జైలుశిక్ష

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (13:07 IST)
కాలేజీ విద్యార్థిని అత్యాచారం కేసులో భారతీయుడికి సింగపూర్ కోర్టు 16 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2014లో మే 4వ తేదీన ఓ యూనివర్సిటీ విద్యార్థిని రాత్రి పొద్దుపోయాక బస్ స్టాపుకు నడుచుకుంటూ వెళ్ళింది. 
 
అక్కడ క్లీనర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల చిన్నయ్య ఆమెకు తప్పుడు సమాచారం ఇచ్చి వేరే మార్గంలోకి మళ్లించాడు. ఆ తర్వాత ఆమెపై దాడిచేసి గాయపరిచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
 
యువతిపై దాడిచేసిన చిన్నయ్య ఆమె గొంతు నొక్కడంతో ఊపిరి ఆడలేదని, అతడి చెయ్యిని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేసిందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కయాల్ పిల్లే తెలిపారు. అయితే, పట్టువిడవని చిన్నయ్య సైలెంట్‌గా ఉండాలని, అరిచి గింజుకున్నా ఇక్కడెవరూరారని హెచ్చరించాడు. 
 
అత్యాచారం అనంతరం ఆమె వస్తువులతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఫోన్ చిన్నయ్య తీసుకెళ్లిన బ్యాగ్‌లో ఉండిపోవడంతో బాయ్ ఫ్రెండ్‌కు విషయం చెప్పలేకపోయింది. ఆ తర్వాత అతి కష్టం మీద ఓ స్నేహితుడికి జరిగింది చెప్పగా, అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రోజే చిన్నయ్యను అరెస్ట్ చేశారు. తాజాగా విచారణ పూర్తి కాగా చిన్నయ్యకు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments