Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా పొమ్మంటుంది.. బ్రిటన్ రమ్మంటుంది...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (08:40 IST)
భారతీయ వృత్తి నిపుణులకు శుభవార్త. తమ దేశంలో ఉద్యోగ అవకాశాలు విస్తారంగా ఉన్నాయని, వృత్తి నిపుణులైన భారతీయులకు ఇదే తమ ఆహ్వానం అంటూ బ్రిటన్ పిలుపునిచ్చింది. మరోవైపు, అమెరికా మాత్రం అక్కడ పని చేస్తున్న భారతీయ ఉద్యోగులతో పాటు కొత్త ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు మాత్రం తమ దేశానికి రావొద్దని అంటోంది. 
 
ఇటీవల అమెరికా హెచ్1బి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసిన విషయం తెల్సిందే. దీంతో అమెరికాలో ఉద్యోగం అనే మాట ఇక మరిచిపోవాల్సిందే. అదేసమయంలో బ్రిటన్ మాత్రం తమ దేశంలో ఉద్యోగ ఉవకాశాల కోసం వృత్తి నిపుణులైన భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది. 
 
ఇందులోభాగంగా యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలతో సమానంగా భారతీయ నిపుణులకు వీసాలు మంజూరు చేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం చాలా మంచిదని వృత్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇందుకోసం వలస వ్యవస్థలో సమూల మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా, అత్యంత నిపుణులైన వారి వలసలపై ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఎత్తివేయనుంది. దీంతో ఇప్పటివరకు యేడాదికి 20700 వర్క్ వీసాలు మాత్రమే జారీ చేయాలనే నిబంధనను పూర్తిగా తొలగించనున్నారు. ఇది బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో 40 యేళ్ళలో అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments