Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే ఒకటైన ప్రేమజంట... బెత్తం దెబ్బలతో బడితెపూజ

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (20:38 IST)
ముస్లిం ప్రాబల్య దేశాల్లో షరియా చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ చట్టం మేరకు శిక్షలు అనుభవించాల్సిందే. తాజాగా, ఓ ప్రేమజంట పెళ్లికి ముందే తొందరపడుతూ అక్కడి అధికారుల కంటికి చిక్కారు. అంతే, షరియా చట్టం మేరకు ఆ ప్రేమికులకు బహిరంగంగా బడితెపూజ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముస్లిం దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఇక్కడ అకే ఫ్రావీన్స్‌లో ఓ యువతీయువకుడు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, ఆ ప్రేమ జంట పెళ్లికి ముందే శారీరకంగా కలుసుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా చిక్కిపోయారు. 
 
దీంతో షరియా అధికారులు ఆ ప్రేమికులను అందరిముందు నిలబెట్టి బడితెపూజ చేశారు. షరియా చట్టం మేరకు వంద బెత్తం దెబ్బల శిక్ష విధించారు. దీంతో అధికారులు ఈ శిక్షను బహిరంగంగా అమలు చేశారు. అయితే, ఆ యువతి ఆ బెత్తం దెబ్బలకు తాళలేక స్పృహతప్పి పడిపోయినప్పటికీ క్షమించలేదు. ఆ యువతికి మధ్యమధ్యలో వైద్యపరీక్షలు చేస్తూ వంద బెత్తం దెబ్బల శిక్షను పూర్తిచేశారు. 
 
అలాగే, ఆ యువకుడికి కూడా వంద దెబ్బల శిక్షను పూర్తిచేశారు. ఈ దెబ్బలకు యువకుడి వీపు చిట్లిపోయింది. నిజానికి ఇండోనేషియాలో పెళ్లికాని యువతీ యువకులు ఒకరిని ఒకరు తాకడం, చేతిలో చేయి వేసుకుని నడవడం శిక్షార్హం. గతంలో కూడా ఓ యువతీ యువకుడు ఇలాగే చేతిలోచేయివేసుకుని నడిచినందుకుగాను బెత్తం దెబ్బల శిక్షను విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments