Webdunia - Bharat's app for daily news and videos

Install App

900 మందిని హత్య చేశా.. రోజుకో అమ్మాయి.. 200 మంది మహిళలపై రేప్

ఐసిస్ ఉగ్రవాదులు కిరాతకులు అనే విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్‌కు చెందిన ఓ ఉగ్రవాది తాజా ఇంటర్వ్యూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్టాసీ అనే జర్నలిస్ట్, గతంలో ఐసిస్ సెక్స్ బానిసగా పనిచేసి

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (09:28 IST)
ఐసిస్ ఉగ్రవాదులు కిరాతకులు అనే విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్‌కు చెందిన ఓ ఉగ్రవాది తాజా ఇంటర్వ్యూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్టాసీ అనే జర్నలిస్ట్, గతంలో ఐసిస్ సెక్స్ బానిసగా పనిచేసి బయటకు వచ్చిన షరీన్ అనే యువతి సాయంతో ప్రస్తుతం ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలోని జైలులో ఉన్న ఓ ఉగ్రవాదిని ఇంటర్వ్యూ చేసింది. 
 
ఈ ఇంటర్వ్యూలో తాను ఐఎస్ఐఎస్ కమాండర్‌గా పనిచేస్తున్న సమయంలో సుమారు 900 మందిని హత్యచేశానని అతను చెప్పగా అవాక్కైంది. రోజుకో అమ్మాయి చొప్పున 200 మంది మహిళలపై తాను అత్యాచారాలు చేశానని కూడా అతను అంగీకరించాడు. తాను అత్యాచారం చేసిన వారిలో 15, 16 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్ల మహిళల వరకూ ఉన్నారన్నాడు. తాను రేప్ చేసిన వారిలో అత్యధికులు అయిష్టంగానే తనతో గడిపేవారని, ఎందుకంటే ఆ తర్వాత వారు ఏడుస్తుండటాన్ని తాను చూశానని చెప్పాడు.
 
తాను రేప్ చేయకుంటే, తనపై కమాండర్ తనను హత్య చేసుండేవాడని, కమాండర్‌గా హత్యలు, రేప్‌లు తన విధి అని తెలిపాడు. ఐఎస్ కమాండర్లలో తనవంటి వారు కొన్ని వందల మంది ఉన్నారన్నాడు. తానిప్పుడు మరణం కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం