Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్-ఇరాక్‌లలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు.. 150మంది మృతి

ఇరాన్‌-ఇరాక్‌లలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ భూకంపంతో 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, వేలాదిమంది గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దు ప

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (08:52 IST)
ఇరాన్‌-ఇరాక్‌లలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ భూకంపంతో 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, వేలాదిమంది గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు కుప్పకూలినట్లు సమాచారం. ఒక్కసారిగా భూమి కంపించిపోవడంతో భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.  
 
క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి, సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి వుంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 
భూకంపం తీవ్రత.. పూర్తిగా తొలగిపోలేదని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు వుండటంతో భవంతులు, లిఫ్ట్‌‌లకు ప్రజలు దూరంగా ఉండాలని ఇరాక్‌ మెట్రోలాజికల్‌ ఆర్గనైజేషస్‌ ఇరాకీ స్టేట్‌ టీవీ ద్వారా ఆదేశాలు జారీ చేసింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments