Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఉగ్ర దాడి సూత్రధారే మా గ్రూప్ లీడర్ : ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు

గత యేడాది పారిస్‌లో జరిగిన ఉగ్రదాడికి తామే కారణమని తమిళనాడులో అరెస్టు అయిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు వెల్లడించాడు. గతేడాది పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిలో 130 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సూత్ర

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (09:38 IST)
గత యేడాది పారిస్‌లో జరిగిన ఉగ్రదాడికి తామే కారణమని తమిళనాడులో అరెస్టు అయిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు వెల్లడించాడు. గతేడాది పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిలో 130 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన బెల్జియమ్ దేశస్థుడు అబ్దెల్ హమీద్ అబావూద్ తమ గ్రూప్ లీడర్ అని తమిళనాడుకు చెందిన సుబాహని హజా మొయిదీన్ పేర్కొన్నాడు. 
 
తమిళనాడు నుంచి వెళ్లి ఐఎస్ఐలో చేరిన మొయిదీన్ ఐఎస్ ఉగ్రవాదులతో కలిసి ఇరాక్ దళాలకు వ్యతిరేకంగా పోరాడిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 8న చెన్నై నుంచి ఇస్తాంబుల్.. అక్కడి నుంచి పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్, ఇతర దేశాలకు చెందిన విదేశీ జిహాదిస్టులతో కలిసి సిరియా చేరుకున్నాడు. ఇరాక్ చేరుకున్నాక తమకు మత బోధనలు చేశారని, ఏకే-47, గ్రనేడ్లు పేల్చడం, బాంబుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇచ్చారని మెయిదీన్ పేర్కొన్నాడు. 
 
పారిస్ దాడికి పథకం రచించిన వారు తమ గ్రూపులోని వారేనని, ఆ దాడి సూత్రధారే తమ గ్రూపు నాయకుడని వివరించాడు. మొయిదీన్ మోకాలి గాయంతో బాధపడుతూ సెప్టెంబరు 22, 2015న టర్కీ మీదుగా భారత్ చేరుకున్నాడు. ఈ నెల మొదట్లో ఎన్ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
తాను భారత్ వచ్చాక పారిస్ దాడి జరిగిందని, దానికి సూత్రధారి తమ గ్రూపు నాయకుడే అని తెలిసి ఆశ్చర్యపోయానని విచారణలో వెల్లడించాడు. తనకు, ఆ దాడికి ఎటువంటి సంబంధం లేదన్నాడు. మొయిదీన్‌ను ‘స్లీపర్ సెల్’ సభ్యుడిగా భావిస్తున్న అధికారులు ఐఎస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇక్కడ ఉండేందుకు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments