Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో మారణ కాండ.. 60 మంది మృతి

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (09:37 IST)
Moscpw
మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో శుక్రవారం జరిగిన ఉగ్రదాడిలో 60 మందికి పైగా మరణించారని రష్యాలోని పరిశోధనాత్మక కమిటీ (ICR) పేర్కొంది. ఈ ఉగ్రవాదుల దాడిలో 60 మందికి పైగా మరణించగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది. 
 
మూడు నుండి ఐదుగురు గుర్తుతెలియని ముష్కరులు, అసాల్ట్ రైఫిల్స్‌తో శుక్రవారం మాస్కో మాల్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కనీసం 40 మంది కాల్చి చంపబడ్డారు. 100 మందికి పైగా గాయపడ్డారు. కచేరీ హాలులో మంటలు చెలరేగాయి.
 
క్రోకస్ సిటీ మాల్ మారణకాండపై దర్యాప్తు జరుగుతోంది. నగర సరిహద్దుకు వెలుపల ఉన్న మాస్కో ప్రాంతంలో ఉన్న మాల్‌పై రాత్రి 8 గంటల సమయంలో దాడి జరిగింది. భవనానికి నిప్పు పెట్టడానికి హ్యాండ్ గ్రెనేడ్లను ఉపయోగించినట్లు కూడా దర్యాప్తులో తేలింది. 
 
ఈ ఘటనా స్థలంలో సాయుధ పోలీసు స్పెషల్ ఆపరేషన్ యూనిట్లు ఆ ప్రదేశంలో మోహరించారు. మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments