Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బైడెన్‌-పుతిన్‌ భేటీ

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (08:27 IST)
రష్యా, అమెరికా దేశాధినేతల కీలక భేటీ బుధవారం జెనీవాలో జరగనుంది. ఈ సమావేశం నుంచి పెద్దగా ప్రతిఫలాన్ని ఆశించొద్దని ఇరు దేశాల నేతలు పేర్కొంటున్నప్పటికీ ఏదో ఒక మిరాకిల్‌ జరగవచ్చన్న ఆశాభావాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా ఆధ్వర్యంలోని ఏక ధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందని, అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యం వహించే బహుళ ధ్రువ ప్రపంచం దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పుతిన్‌ పేర్కొంటుండగా, ప్రపంచ ఆర్థిక, రాజకీయాలను శాసించేది రష్యా, చైనా కాదు, తామేనని బైడెన్‌ వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అమెరికా, రష్యాపట్ల వ్యూహాత్మక ఘర్షణ వైఖరిని అనుసరిస్తున్నది. అమెరికా ప్రపంచాధిపత్యాన్ని సవాల్‌ చేసేందుకు చైనాతో కలసి రష్యా వ్యూహాత్మక మైత్రిని పటిష్టపరచుకుంటున్నది. గత వారాంతంలో కార్నివాల్‌లో జరిగిన జి-7 దేశాల సదస్సు చేసిన సంయుక్త ప్రకటనలో రష్యాను హానికరమైన దేశంగా పేర్కొన్నది.

బుధవారం నాటి ముఖాముఖి సమావేశంలో నాటో, ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా జోక్యం గురించి పుతిన్‌ లేవనెత్తే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి ప్రతిగా బైడెన్‌ క్రిమియా అంశాన్ని ప్రస్తావించే అవకాశముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments