Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా 'ఆక్సిజన్' కొరత.. నిపుణుల ఆందోళన

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (15:55 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో నెలకొన్న ఆక్సిజన్‌ కొరతపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు చికిత్స కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రస్తుతం వెంటిలేటర్ల కొనుగోళ్లతో పాటు ఉత్పత్తిపై అధికంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.
 
అయితే, కరోనా రోగులకు అందించే థెరపీల్లో ఆక్సిజన్ థెరపీ చాలా ప్రధానమైందని వైద్యులు చెబుతున్నారు. ఆఫ్రికాతో పాటు ఆసియా-పసిఫిక్‌లోని అనేక పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత అధికంగా ఉందని చెప్పారు. 
 
కరోనా పేద దేశాల్లోనూ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశాల్లో ఆక్సిజన్ థెరపీ మాత్రం రోగుల ప్రాణాలను కాపాడగలదని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డా హమిశ్ గ్రాహం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఆక్సిజన్‌పై దృష్టి పెట్టకుండా కేవలం వెంటిలేటర్ల గురించే ఆలోచించడం సరికాదని ఆయన అంటున్నారు.
 
ఫిబ్రవరిలో జరిపిన ఓ పరిశోధనలో పలు విషయాలు తెలిశాయని వివరించారు. చైనాలో నమోదైన కరోనా కేసుల్లో 20 శాతం మందికి ఆక్సిజన్ అవసరమైందని హమిశ్ గ్రాహం చెప్పారు. కరోనా రోగుల ఊపిరితిత్తులపై  వైరస్ న్యూమోనియా రూపంలో దాడి చేస్తుందని ఆయన తెలిపారు.
 
దీంతో ఆక్సిజన్‌ను గ్రహించే శక్తిని ఊపిరితిత్తులు కోల్పోతాయని ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. దీంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, మృతి చెందే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
 
ఆయా దేశాల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి సమయం మరికొన్ని రోజులే ఉందని, కరోనా విజృంభణ పెరిగిపోతే పరిస్థితులు చేజారి పోతాయని తెలిపారు. అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఆక్సిజన్ కొరత అంతగా లేకపోయినప్పటికీ పేద దేశాల్లో తీవ్రంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments