Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్: కాబూల్‌కు విమాన సర్వీసులు కట్

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (19:11 IST)
ఆప్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ షాకిచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) గురువారం ప్రకటించింది. తాలిబన్ల అతి జోక్యమే దీనికి కారణమని ఆరోపించింది. 
 
అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆగస్ట్‌ 31 నుంచి ఆ దేశానికి అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 
 
అనంతరం కొన్ని రోజుల తర్వాత నుంచి పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) మాత్రమే కాబూల్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగిస్తున్నది. కాబూల్‌లోని విదేశీ, చారిటీ సంస్థల సిబ్బంది తరలింపునకు సహకరిస్తున్నది.
 
అయితే విమాన ఛార్జీలను తగ్గించాలని, తమ స్వాధీనానికి ముందు నాటి రేట్లను కొనసాగించాలని తాలిబన్ ప్రభుత్వం పీఐఏను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం ఏకపక్షంగా నియమాలను మార్చుతుందని, తమ సిబ్బందిని బెదిరిస్తున్నదని పీఐఏ ఆరోపించింది. 'తాలిబన్‌ అధికారుల జోక్యం తీవ్రత కారణంగా ఈ రోజు నుండి కాబూల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాం' అని గురువారం అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments