Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేస్కుంటున్న పాక్, ఇమ్రాన్‌ను నిలదీత

Webdunia
బుధవారం, 13 మే 2020 (17:51 IST)
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం గతేడాది ఆగస్టు 5న రద్దుచేసిన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత అడుగంటాయి. ప్రత్యేక హోదాని రద్దు చేయడంతో దాయాది దేశానికి ఆక్రోశం ఆగడం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, పాకిస్థాన్ భారత్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. 
 
అయితే, కరోనా కారణంగా ప్రాణాధార ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడటంతో, భారత్ నుంచి కొన్నింటిని దిగుమతి చేసుకోడానికి పాక్ ప్రభుత్వం అనుమతించింది. వాటితో పాటు ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరకును కూడా దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిని అవకాశంగా చేసుకుని భారత్‌ నుంచి విటమిన్‌ మాత్రలు లాంటి 450కి పైగా ఔషధాలను దిగుమతి చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. 
 
దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. అక్రమ దిగుమతులకు సంబంధించిన విచారణ బాధ్యతలను తన సహచరుడు షాజాద్ అక్బర్‌కు అప్పగించారు. కాగా భారత్ నుంచి అనేక విటమిన్లు, ఔషధాలు, లవణాలు దిగుమతి చేసుకున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీసెస్‌ పేర్కొన్నట్టు తెలియజేసే నివేదికను డాన్ పత్రిక ప్రచురించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments