Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌‌‍బుక్‌ను నిషేధించే దిశగా పాకిస్థాన్: 2018నాటికి ఆ పనిచేసేస్తుందా?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌ను నిషేధించే దిశగా పాకిస్థాన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. దైవదూషణ, చట్ట విరుద్ధ వ్యాఖ్యలు వంటివి అత్యంత వేగంగా విస్తరించేందుకు ఫేస్ బుక్, వాట్సాప్ లాంటివి కారణమవుత

Webdunia
శనివారం, 29 జులై 2017 (15:22 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌ను నిషేధించే దిశగా పాకిస్థాన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. దైవదూషణ, చట్ట విరుద్ధ వ్యాఖ్యలు వంటివి అత్యంత వేగంగా విస్తరించేందుకు ఫేస్ బుక్, వాట్సాప్ లాంటివి కారణమవుతున్నాయని పాకిస్థాన్ సర్కారు భావిస్తోంది. దైవదూషణకు సంబంధించిన కామెంట్లపై ఫేస్ బుక్ దృష్టి సారించకపోతే.. 2018 నాటికి ఫేస్ బుక్‌ను నిషేధించే యోచనలో పాకిస్థాన్ ప్రభుత్వం ఉంది.
 
కాగా.. కొత్తగా ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్న వారి ఖాతాలకు ఫోన్ నెంబర్లను కచ్చితంగా లింక్ చేసేలా చేయాలని ఫేస్ బుక్‍‌ను పాకిస్థాన్ డిమాండ్ చేసింది. తద్వారా అకౌంట్ల హోల్డర్ల వివరాలను సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని పాకిస్థాన్ వెల్లడించింది. కానీ పాకిస్థాన్ చేసిన డిమాండ్‌ను ఫేస్ బుక్ తిరస్కరించింది.
 
ఇదిలా ఉంటే... లాహోర్‌‍లోని ఒకారా ప్రాంతానికి చెందిన షియూ ముస్లిం అయిన తైమూర్ రజా ఫేస్ బుక్‌లో దైవదూషణ చేస్తూ కొంత సమాచారాన్ని ఉంచటంతో, తన సహ ఉద్యోగి ఆయనపై ఫిర్యాదు చేశాడ. దీంతో అతడు అరెస్టయ్యాడు. ఈ కేసుపై పంజాబ్ ప్రావిన్స్‌లోని బాహవాల్పూర్ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం తైమూర్‌కు మరణదండన విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments