Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీకి అమ్మాయిలను పిలుస్తావా? ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థి

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (13:13 IST)
ఇస్లాం సంప్రదాయం ప్రకారం పార్టీకి అమ్మాయిలను(విద్యార్థినిలను) ఆహ్వానించడం విరుద్ధం. కానీ, ఆ ప్రొఫెసర్ మాత్రం పార్టీకి అమ్మాయిలను పిలిచాడు. దీన్ని ఓ విద్యార్థి జీర్ణించుకోలేక పోయాడు. అంతే, ఆ ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం పాకిస్థాన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బహవాల్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ సాదిఖ్‌ ఎగెర్టన్‌ కళాశాలలో ఖలీద్‌ హమీద్‌ అనే వ్యక్తి ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయన మరో నాలుగు నెలల్లో రిటైర్డ్ కానున్నారు. 
 
దీంతో ఆయనకు కాలేజీలో వీడ్కోలు పార్టీ ఏర్పాటుచేశారు. ఈ పార్టీకి విద్యార్థినిలను సైతం ఆహ్వానించాడు. నిజానికి ఇలాంటి కార్యక్రమాల్లో ఆడపిల్లలు పాల్గొనడం ఇస్లామిక్‌ సంప్రదాయాలకు విరుద్ధం. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ వద్ద ఓ విద్యార్థి ప్రస్తావించాడు. కానీ, అతని నుంచి సరైన సమాధానం రాలేదు. అంతే, కత్తితో సదరు ప్రొఫెసర్‌‌పై దాడి చేశారు. ఆ ప్రొఫెసర్ ఇపుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, దాడికి ఉపయోగించిన కత్తిని సైతం స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments