Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ వ్యక్తితో హైదరాబాదీ అమ్మాయి పెళ్లి.. భారత్‌కు పంపనని చిత్ర హింసలు.. గదిలో బంధించి..

పాకిస్థాన్ వ్యక్తి హైదరాబాద్ మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. నీ గొంతులో ప్రాణం ఉండగా.. నిన్ను భారత్‌కు పంపించే ప్రసక్తే లేదని ఆ మహిళను గదిలో నిర్భంధించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదీ అమ్మాయి అయిన

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (09:25 IST)
పాకిస్థాన్ వ్యక్తి హైదరాబాద్ మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. నీ గొంతులో ప్రాణం ఉండగా.. నిన్ను భారత్‌కు పంపించే ప్రసక్తే లేదని ఆ మహిళను గదిలో నిర్భంధించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదీ అమ్మాయి అయిన బేగంను పాకిస్థాన్ వ్యక్తి మహ్మద్ యూనిస్ మోసగించి పెళ్లి చేసుకున్నాడు. ఆపై పిల్లలు పుట్టాక.. ఆమెను భారత్‌కు పంపించేది లేదని చెప్పేశాడు. పిల్లల్ని కూడా ఆమెకు దూరంగా ఉండాల్సిందిగా షరతు విధించాడు. 
 
ఇలా హైదరాబాద్ అమ్మాయి పాకిస్థాన్‌లో అష్టకష్టాలు పడుతుందని తెలుసుకుని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆదేశాలతో పాక్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు బాధిత మహిళను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. సదరు అధికారులు వెళ్లగానే మహమ్మదీ బేగంను తీవ్రంగా కొట్టి ఓ గదిలో ఆ దుర్మార్గుడు నిర్భంధించాడు. 
 
1996లో బేగంను ఓ సైకిల్ మెకానిక్ అయిన యూనిస్ పెళ్లాడాడు. ఓ ఏజెంట్‌ ద్వారా ఇద్దరికీ ఫోన్‌లోనే నిఖా జరిపించారు. ఆ వెంటనే భర్తతో కలిసి ఉండేందుకు మహమ్మదీ బేగం మస్కట్‌కు వెళ్లింది. కానీ కొన్నేళ్ల తర్వాతే అతడు పాకిస్థాన్ జాతీయుడని బేగంకు తెలిసింది. ఆపై బలవంతంగా పాకిస్థాన్‌కు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి భర్త, అత్తామామలు.. మహమ్మదీ బేగంను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అత్తింటి చెర నుంచి తన కూతురిని విడిపించి, భారతకు రప్పించాలంటూ గత జనవరిలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు ఈ-మెయిల్‌ ద్వారా బేగం తండ్రి అక్బర్‌ విజ్ఞప్తి చేశాడు. దీంతో బేగంను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అక్బర్‌కు కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సుష్మ స్వరాజ్ ఆదేశాల మేరకు పాక్‌లో భారత రాయబార కార్యాలయ అధికారులు మహ్మదీబేగంను కలిశారు. 
 
కానీ మహ్మద్ దాష్టీకాన్ని ప్రదర్శించాడు. దీంతో అధికారులు ఏమీ చేయలేక తిరుగుముఖం పట్టారు. అయితే తన కుమార్తెను పాక్ దేశస్థుడి చెర నుంచి విడిపించాలని బేగం తండ్రి కోరుతున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments