Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో దారుణం... తెలుగు డాక్టర్‌ను పొడిచి చంపేశారు...

అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు వైద్యుడిని గుర్తు తెలియని దుండగుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం కాన్సాస్‌‌లోని ఎడ్జ్‌మూర్‌లో క్లినిక్‌ దగ్గర జరిగింది. మృతుడిని డాక్టర్ అచ్యుతారెడ్డిగా గుర్తించా

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (07:58 IST)
అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు వైద్యుడిని గుర్తు తెలియని దుండగుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం కాన్సాస్‌‌లోని ఎడ్జ్‌మూర్‌లో క్లినిక్‌ దగ్గర జరిగింది. మృతుడిని డాక్టర్ అచ్యుతారెడ్డిగా గుర్తించారు. 
 
ఆయ‌న‌ మృతదేహాన్ని పార్కింగ్‌ వెనుక భాగంలో పోలీసులు గుర్తించి, ఉమర్‌ రషీద్‌ దత్ అనే అనుమానితుడిని విచితలోని కంట్రీక్లబ్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆ దుండ‌గుడు అచ్యుతా రెడ్డితో కాసేపు మాట్లాడి ఒక్క‌సారిగా కత్తితో దాడి చేశాడని పోలీసులు గుర్తించారు.
 
మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ‌. ఆయ‌న‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేసి, 1989 నుంచి అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్నారు. అచ్యుత రెడ్డి మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments