Trump To Visit China?: చైనాలో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్

సెల్వి
శుక్రవారం, 6 జూన్ 2025 (09:53 IST)
China_US
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో టెలిఫోన్ సంభాషణ తర్వాత తాను చైనాను సందర్శిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫోన్ కాల్ తర్వాత, చర్చల సందర్భంగా వైట్‌హౌస్‌కు ఆహ్వానం పంపినట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ఇరు పక్షాలు ఇంకా అలాంటి పర్యటనను ధృవీకరించలేదు.
 
ఫిబ్రవరిలో ట్రంప్ బీజింగ్‌తో సుంకాల యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇద్దరు నాయకులు మొదటిసారి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. చైనా మీడియా ప్రకారం, వైట్ హౌస్ అభ్యర్థన మేరకు ఈ కాల్ జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సంభాషణ ప్రధానంగా వాణిజ్యంపై దృష్టి సారించింది. ఇంకా రెండు దేశాలకు చాలా సానుకూల ముగింపుకు దారితీసింది" అని ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
"జిన్‌పింగ్‌ నన్ను చైనాకు ఆహ్వానించారు. నేను జిన్‌పింగ్‌ ఇక్కడికి ఆహ్వానించాను" అని ఓవల్ కార్యాలయంలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ను కలిసిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు అన్నారు. చైనాలో తాము పర్యటిస్తామని, అలాగే జిన్‌పింగ్ కూడా అమెరికాలో పర్యటిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు.  
 
ఇటీవల జెనీవాలో జరిగిన ఒప్పందంపై ఇరు దేశాలు కుదుర్చుకున్న ఏకాభిప్రాయానికి చైనా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఇరు దేశాలు తమ హామీని నిలబెట్టుకుంటాయని ట్రంప్‌తో జిన్‌పింగ్ చెప్పినట్లు టాక్. సుంకాలను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments