Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌కు తిక్కుంది.. ఐతే దానికో లెక్కే లేదా? అమెరికాను ఏం చేయబోతున్నాడు?

అమెరికా అధ్యక్ష పోటీలో బరిలో దిగిన దగ్గర్నుంచి నోటికి పదును పెడుతూ హాటెస్ట్ పొలిటికల్ స్టార్ అయిన డోనాల్డ్ ట్రంప్ జనవరిలో అమెరికా పీఠాన్ని అధిష్టించనున్నారు. ఐతే అయ్యగారు అప్పుడే తన ప్రణాళికలను వరసబెట్టి చెప్పేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే చాలామంది

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (22:05 IST)
అమెరికా అధ్యక్ష పోటీలో బరిలో దిగిన దగ్గర్నుంచి నోటికి పదును పెడుతూ హాటెస్ట్ పొలిటికల్ స్టార్ అయిన డోనాల్డ్ ట్రంప్ జనవరిలో అమెరికా పీఠాన్ని అధిష్టించనున్నారు. ఐతే అయ్యగారు అప్పుడే తన ప్రణాళికలను వరసబెట్టి చెప్పేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే చాలామంది గుండెల్లో గుభేల్ మంటోంది.
 
ప్రపంచంలో అమెరికా అంటే అదో స్టామినా, అదో లెఖ్ఖ, అదో గొప్ప స్థానం. ప్రపంచానికే పెద్దన్న అనే గొప్ప వాక్యం. ప్రపంచంలోని ఎంతమందినైనా ఆదుకోవాలంటే అమెరికానే ఆదుకోగలదనే టాక్. అలాంటిది ట్రంప్ వరుసగా పేలుస్తున్న మాటల బాంబుల దెబ్బకు అక్కడివారు బెంబేలెత్తిపోతున్నారు. 
 
ఎన్నికలకు ముందుగానే కాకుండా... ఎన్నికలు అయ్యాక కూడా ఆయన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను గద్దెనెక్కిన వెంటనే 30 లక్షల మందిని ఇంటికి పంపిస్తానంటూ బాంబు పేల్చారు. దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 30 లక్షల మంది విదేశీయులను గద్దెనెక్కిన మరుక్షణమే ఇంటికి పంపిస్తానని ప్రకటించి గుబులు రేపారు. 
 
దేశంలో నేరగాళ్లు, నేరచరిత్ర ఉన్నవాళ్లు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ డీలర్లు దాదాపు 30 లక్షల మంది వరకు ఉన్నారని, వారిని స్వదేశాలకు పంపడమో, నిర్బంధించడమో చేస్తామని తెలిపారు. మెక్సికో నుంచి అమెరికాలోకి క్రిమినల్స్, డ్రగ్స్‌ను అరికట్టేందుకు సరిహద్దులో గోడ కట్టి తీరుతామని మరోమారు స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments