Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (09:57 IST)
సాధారణంగా ఒక ప్రసవంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుడుతుంటారు. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అదీకూడా కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే. ఇలా జరగడం అద్భుతమని వైద్యులు చెపుతున్నారు. ముఖ్యంగా, ఇలాంటి మహిళ 470 కోట్ల మంది మహిళల్లో ఒకరు ఉంటారని తెలిపారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూఎస్‌లోని టెక్సాస్‌లో ఉన్న మహిళల ప్రసూతి ఆస్పత్రిలో ఓ మహిళ ప్రసవం కోసం చేరింది. ఈ మహిళకు కొందరు వైద్యులు దగ్గరుండి కాన్పు చేశారు. ఈ కాన్పులో ఆమెకు ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో నలుగురు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. ఈ డెలివరీని సెక్స్‌టప్లెట్స్ అని అంటారట. సెక్స్‌టప్లెట్ అంటే ఒకే డెలివరీలో ఆరుగురు పిల్లలకు జన్మనివ్వడం. 
 
ముందుగా ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత మరో ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత ఇద్దరు ఆడబిడ్డలకు ఆ మహిళ జన్మనిచ్చిందట. ప్రస్తుతం ఆరుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఉదయం 4.50 నుంచి 4.59 వరకు కేవలం 9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి తెల్మా చియాక ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లలంతా.. 790 గ్రాముల నుంచి 1.3 కిలోల బరువుతో జన్మించారట. వాళ్లను ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి అబ్సర్వేషన్‌లో పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం