Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనా యుద్ధం తప్పదా? సైనికుల కొట్లాట (Video)

భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం వచ్చేలావుంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు మొహరించివున్నారు. అలాగే, ఎపుడైనా యుద్ధానికి సిద్ధమనే సంకేతాలనూ ఇరు దేశాలు పంపించుకుంటున్నాయి. ఇంతలో లడక్‌లో ఇరు దేశ

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (13:32 IST)
భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం వచ్చేలావుంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు మొహరించివున్నారు. అలాగే, ఎపుడైనా యుద్ధానికి సిద్ధమనే సంకేతాలనూ ఇరు దేశాలు పంపించుకుంటున్నాయి. ఇంతలో లడక్‌లో ఇరు దేశాల సైనికులు తలపడ్డాడరు. ఒక‌రిపై మరొక‌రు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. 
 
ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (ఆగస్టు 15వ తేదీ) జరుపుకుంటుంటే... మరోవైపు లడక్‌లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ల‌డ‌క్‌లోని పాంగాంగ్ స‌రస్సు ద‌గ్గ‌ర జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. భార‌త భూభాగంలోకి చైనా సైనికులు రావ‌డానికి ప్ర‌య‌త్నించగా.. భార‌త జ‌వాన్లు అడ్డుకున్నారు. ప‌దుల సంఖ్య‌లో ఇండోటిబెటెన్ బోర్డర్ పోలీసుల‌తోపాటు ఆర్మీ జ‌వాన్లు చైనా సైనికులతో బాహాబాహీకి దిగారు. 

 
 
రెండు గంట‌ల పాటు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆ త‌ర్వాత రెండు దేశాల సైనికులు డ్రిల్ నిర్వ‌హించి బ్యాన‌ర్లు చూప‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. త‌ర్వాత ఎవ‌రి స్థానాల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత బ్రిగేడియ‌ర్ స్థాయి అధికారులు చ‌ర్చించారు. ఇండియా, చైనా సైనికుల మ‌ధ్య చాలా ఏళ్ల త‌ర్వాత ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగింది. ఓవైపు డోక్లామ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలోనే ల‌డ‌క్‌లో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments