Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివ్యూ తప్పుగా రాసిందని మహిళపై వేడివేడి సూప్ పోసిన హోటల్ వెయిటర్

తమ హోటల్ గురించి రివ్యూ తప్పుగా రాయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హోటల్ వెయిటర్.. ఓ మహిళ ముఖంపై వేడివేడి సూప్ పోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన లిన్ అనే మహిళ... తన కుమార

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (12:39 IST)
తమ హోటల్ గురించి రివ్యూ తప్పుగా రాయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హోటల్ వెయిటర్.. ఓ మహిళ ముఖంపై వేడివేడి సూప్ పోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన లిన్ అనే మహిళ... తన కుమార్తెతో కలిసి డిన్నర్ చేద్దామని హోట‌ల్‌‌కి వెళ్లింది. తాగునీరు స‌రిగా లేదని వెయిటర్‌ను ఆమె అడ‌గగా ఆమెకు వెయిట‌ర్‌ జూ సరైన సమాధానం చెప్పలేదు. 
 
దీంతో లిన్‌ హోటల్‌‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ నెగిటివ్‌‌గా రివ్యూ పోస్ట్‌ చేసింది. చైనాలో క‌స్ట‌మ‌ర్ల రివ్యూలను చూసే కొత్త క‌స్ట‌మ‌ర్లు వ‌స్తుంటారు. ఆమె పోస్ట్ చేసిన రివ్యూని చూసిన వెయిటర్ జూ అలా ఎందుకు చేశావంటూ మరోసారి ఆమెతో గొడవ ప‌డి.. పోస్టు తీసేయాలని కోరాడు. 
 
అతని వినతిని ఆమె తిరస్కరించడమే కాకుండా, ఆగ్రహించుకుంది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన వెయిటర్.. వంటగదిలో సిద్ధంగా ఉన్న వేడి వేడి సూప్‌‌ని తీసుకొచ్చి ఆమె ముఖంపై పోసాడు. అయిన‌ప్ప‌టికీ కోపం త‌గ్గించుకోని వెయిట‌ర్ ఆమెను చిత‌క్కొట్టాడు. ఈ దృశ్యాల‌న్నీ ఆ హోటల్‌ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 
 
ఆ మ‌హిళ‌పై జు చేస్తోన్న దాడి ఆపేలా చేయ‌డానికి అక్క‌డి ఐదురుగు వ్య‌క్తులు ప్ర‌య‌త్నించాల్సి వ‌చ్చింది. ఆమె ముఖం, మెడభాగం, భుజాలు, చర్మం బాగా కాలిపోయి ఆసుప‌త్రి పాల‌యింది. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌ద‌రు వెయిటర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా.. న్యాయ‌స్థానం ఆ వెయిట‌ర్‌కి 22 నెలల జైలు శిక్షను విధించింది. ఆమె చికిత్స కోసం హోట‌ల్‌ యాజమాన్యంకి ఫైన్ వేసింది న్యాయ‌స్థానం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments