Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మాకు రెండో ఇల్లు.. భారత్‌తో మంచి సంబంధాలే కోరుకుంటున్నాం..

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (23:13 IST)
భారత్‌తో తాము మంచి సంబంధాలను కోరుకుంటున్నామని తాలిబన్లు తెలిపారు. ఇటీవల తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్థాన్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. 
 
పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదన్నాడు. అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని చెప్పారు. ఇరు దేశాల ప్రజలు పరస్పరం కలిసిపోతారన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పారు. చెప్పారు. అయితే అఫ్ఘనిస్థాన్‌ను తాము స్వాధీనం చేసుకోవడంలో పాకిస్థాన్ పాత్ర ఏమీ లేదన్నారు.
 
భారత దేశం, పాకిస్థాన్ లు తమ మధ్య ఉన్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి కూర్చుని, చర్చించుకోవాలని అన్నాడు. భారత దేశంతో సహా అన్ని దేశాలతోనూ తాలిబన్లు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ నెల 31న వెళ్ళిపోయే లోగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇస్లాంపై ఆధారపడిన బలమైన ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments