Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు సీటు వెనుక రొమాన్స్‌లో మునిగిపోయిన ప్రేమజంట.. గేరు మారడంతో సరస్సులోకి?

ప్రేమ జంటలు ప్రస్తుతం పార్కు, బీచ్‌లో ఓవరాక్షన్ చేస్తున్నాయి. ప్రేమిస్తున్నామంటూ.. అందరి కంట పడేలా రొమాన్స్‌కు పాల్పడుతున్నాయి. తాజాగా కారులోనే రొమాన్సుకు పాల్పడిన ఓ ప్రేమజంట ఊహించని రీతిలో దుర్మరణం చ

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (09:26 IST)
ప్రేమ జంటలు ప్రస్తుతం పార్కు, బీచ్‌లో ఓవరాక్షన్ చేస్తున్నాయి. ప్రేమిస్తున్నామంటూ.. అందరి కంట పడేలా రొమాన్స్‌కు పాల్పడుతున్నాయి. తాజాగా కారులోనే రొమాన్సుకు పాల్పడిన ఓ ప్రేమజంట ఊహించని రీతిలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన రష్యాలోని వోలోగ్రాడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ పాఠశాలలో ఎవిజనీ చెర్నోవ్ (22) పీఈటీగా పని చేస్తున్నాడు. 
 
అతని ప్రియురాలు యానా క్ర్యుచ్ కోవా (22)తో కలిసి మంగళవారం విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో భాగంగా వోల్ గ్రాడ్ శివారులోని ఓ సరస్సు గట్టుమీద కారు ఆపి కొంచెం సేపు మాట్లాడుకున్నారు. 
 
ఆపై వెనుక సీట్లోకి వెళ్లిన ఈ ప్రేమ జంట రొమాన్స్‌లో మునిగిపోయింది. కానీ న్యూట్రల్‌లో ఉన్న కారు గేరు మారడంతో కారు సరస్సులోకి దూసుకెళ్లింది.. నీట మునిగిన కారు నుంచి ఆ ప్రేమజంట బయటపడలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాలను వెలికి తీసి.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌యూవీ కారు సరస్సులో మునిగిపోవడంతో.. రక్షించే వారు ఆ ప్రాంతంలో లేకపోవడంతో వీరిద్దరూ నీటిలోనే తుదిశ్వాస విడిచారని పోలీసులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments