Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి మించిన మొనగాడు లేడు.. యు టర్న్ తీసుకున్న పూణె జట్టు ఓనర్

రైజింగ్ పూణె సూపర్‌జైంట్ జట్టు యజమాని యూ టర్న్ తీసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ జూలు విదిల్చి బ్యాటింగ్ చేయడమే కాకుండా ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని చేకూర్చిపెట్టినందుకు జట్టు యజమాని అభినందల్లో ముంచెత్

Webdunia
రైజింగ్ పూణె సూపర్‌జైంట్ జట్టు యజమాని యూ టర్న్ తీసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ జూలు విదిల్చి బ్యాటింగ్ చేయడమే కాకుండా ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని చేకూర్చిపెట్టినందుకు జట్టు యజమాని అభినందల్లో ముంచెత్తుతున్నాడు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై పూణె జట్టు విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. 
 
అంతకుముందు ధోనీ వరుసగా విఫలం కావడంతో 'అడవికి రారాజు స్మిత్' అంటూ ధోనీని కించపరుస్తూ పూణె టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా సోదరుడు హర్షా గోయంకా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా చెలరేగాయి. క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో, శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ విశ్వరూపం ప్రదర్శించాడు. మ్యాచ్ను గెలవాలంటే మూడు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన తరుణంలో... తనదైన శైలిలో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు ధోనీ. కేవలం 34 బంతుల్లో 61 పరుగులు చేసి తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.
 
దీంతో, పూణె టీమ్ ఓనర్ బ్రదర్ యూటర్న్ తీసుకున్నాడు. ఏ నోటితో అయితే ధోనీపై విమర్శలు చేశాడో... అదే నోటితో ఇప్పుడు జార్ఖండ్ డైనమైట్ను పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ధోనీ ఫామ్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందని... మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో ధోనీకి మించిన మొనగాడు లేడంటూ ట్వీట్ చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments