Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ : చెన్నైకి షాక్ .. 34 రన్స్‌తో.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, చెన్నైసూపర్ కింగ్స్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ షాక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ నుంచి ఔటైన ఢిల్లీ.. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన చెన్నైని చిత్తుగా ఓడించింది. శుక్రవారం రాత్రి

Webdunia
శనివారం, 19 మే 2018 (10:33 IST)
ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, చెన్నైసూపర్ కింగ్స్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ షాక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ నుంచి ఔటైన ఢిల్లీ.. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన చెన్నైని చిత్తుగా ఓడించింది. శుక్రవారం రాత్రి సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కుర్రోళ్లు రెచ్చిపోయారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన శ్రేయాస్ గ్యాంగ్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై సూపర్ విక్టరీని సాధించారు.
 
తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రిషబ్ పంత్  26 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగుల చేయగా, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచాఖర్లో హర్షల్ పటేల్ 16 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఎంగిడి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, చాహర్ తలో వికెట్ తీశారు.
 
ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. 29 బాల్స్ ఆడిన అంబటి రాయుడు నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ధోని 23 బంతుల్లో 17 రన్స్ చేయగా.. రవీంద్ర జడేజా 27 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, అమిత్ మిశ్రా తలో 2 వికెట్లు తీశారు. సందీప్ లామిచానె, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments