Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2018 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న చెన్నై.. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింద

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (12:24 IST)
ఐపీఎల్ 2018 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న చెన్నై.. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింది. ఫలితంగా చెన్నై 64 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. 
 
ముఖ్యంగా, సీఎస్కే జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 106, 9ఫోర్లు, 6సిక్స్‌లు) సెంచరీతో చెన్నై 20 ఓవర్లలో 204/5 స్కోరు చేసింది. గోపాల్(3/20) మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 18.3 ఓవర్లలో 140 స్కోరుకే పరిమితమైంది. బెన్‌స్టోక్స్(45) మినహా ఎవరూ రాణించలేకపోయారు. చాహర్(2/30), శార్దుల్(2/18), బ్రావో(2/16), కర్ణ్‌శర్మ(2/13) రెండేసి వికెట్లతో రాణించారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధనాధన్ ఇన్నింగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్(57 బంతుల్లో 106, 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవీహారం చేసిన వేళ చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 204/5 భారీ స్కోరు నమోదుచేసింది. గాయం నుంచి తేరుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రైనా(29 బంతుల్లో 49, 9ఫోర్లు)కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 
 
ఆ తర్వాత లక్ష్యఛేదన రాజస్థాన్‌కు అంతగా కలిసిరాలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగడంతో రాజస్థాన్ టపాటపా వికెట్లు చేజార్చుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న క్లాసెన్(7) పూర్తిగా నిరాశపరిచాడు. అలాగే, శాంసన్(2) నిరాశపరుస్తూ చాహర్ షార్ట్‌పిచ్ బంతికి బలయ్యాడు. 
 
మరోవైపు ఆదిలో బౌండరీలతో ఆకట్టుకున్న కెప్టెన్ రహానే(16) కూడా.. చాహర్ నకుల్ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రాజస్థాన్ 32 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టోక్స్(45), బట్లర్(22) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే బ్రావో వేసిన తొలి బంతికే..బట్లర్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 63 పరుగుల తేడాతో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా రాజస్థాన్ జట్టు 18.3 ఓవర్లలో 140 స్కోరుకే పరిమితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

ఆపరేషన్ సింధూర్: దేశ వ్యాప్తంగా రాజకీయ నేతల హర్షం.. రాహుల్ ప్రశంసలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

తర్వాతి కథనం
Show comments