Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IPL2018 : బెంగుళూరు చిత్తు.. కోల్‌కతా విజయం

ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తొలత టాస్ ఓడి బ్యాట

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (08:25 IST)
ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తొలత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన కోల్‌‍కతా 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు ఉండగానే విజయం సాధించింది. 
 
కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (29 బంతుల్లో 4 ఫోర్లతో 35 నాటౌట్‌)తో పాటు పించ్‌ హిట్టర్‌ సునీల్‌ నరైన్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 50) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ సహాయంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 4 వికెట్ల తేడాతో బోణీ కొట్టింది. 
 
డివిల్లీర్స్‌ (23 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 44), మెకల్లమ్‌ (27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) రాణించగా చివర్లో మన్‌దీప్‌ (18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) చెలరేగాడు. రాణా, వినయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. నితిష్‌ రాణా (25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) ఆకట్టుకున్నాడు. వోక్స్‌కు 3, ఉమేశ్‌కు 2వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ నరైన్‌కి దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments