చెన్నై విజయాలకు బ్రేక్.. బట్లర్ అదుర్స్.. రంగు మార్చిన రాజస్థాన్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ చుక్కలు చూపించింది. ఈ క్రమంలో శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్య

Webdunia
శనివారం, 12 మే 2018 (09:22 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ చుక్కలు చూపించింది. ఈ క్రమంలో శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయిగా నిలిచింది. 
 
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై వరుస విజయాలకు రహానే సేన బ్రేక్ వేసింది. ఇంకా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కోసం పింక్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో పింక్ జెర్సీతో బరిలోకి దిగిన రాజస్థాన్.. రంగుమార్చి విజయం అందుకుంది.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. చెన్నై ఆటగాళ్లలో ఓపెనర్ షేన్ వాట్సన్ 39, అంబటి రాయుడు 12, కెప్టెన్ ధోనీ 33, శామ్ బిల్లింగ్స్ 27 పరుగులు చేయగా, సురేశ్ రైనా 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (52) సాధించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధీ ఓ వికెట్ నేలకూల్చాడు.
 
అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ విజృంభిచాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్ వేసిన డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ రెండు సిక్సర్లు బాదడంతో విజయం రాజస్థాన్ వైపు మళ్లినా చివరి బంతికి అతడు అవుటవడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
 
చివరి ఓవర్లో మూడు బంతులకు 10 పరుగులు చేయాల్సిన తరుణంలో బ్రావో వేసిన మూడో బంతికి రెండు పరుగులు సాధించిన బట్లర్ తర్వాతి బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు రావడంతో జట్టుకు విజయం సాధించిపెట్టాడు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసీపీకి కోవర్టుగా మారిన ప్రకాశ్ రాజ్.. ఫైర్ అయిన కిరణ్ రాయల్

అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ అమ్మిన ఇంటిలోనే ఆయువు తీసుకున్నారు...

ఏడు అడుగులు వేసిన భర్త వదిలేస్తే.. ఆసరాగా ఉంటామన్న సన్నిహితులు మోసం చేశారు.... అందుకే...

ఇంట్లో భర్తను చంపుతుంటే.. ఇంటి బయట కాపలా ఉన్న భార్య... ఎక్కడ?

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణ్ రామ్ బర్త్‌ : సర్‌ప్రైజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

Peddi OTT: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్‌ పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ చూడాలి !

Thiruveer : ప్రాణాయామం చేస్తూ మెలోడీ సాంగ్ తో తిరువీర్, ఐశ్వర్య రాజేష్

Samantha: సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్న సమంత

తర్వాతి కథనం
Show comments