Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 14 సీజన్ : ముంబై ఇండియన్స్ కథ కంచికి...

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (07:48 IST)
ఐపీఎల్ 14వ సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ఆ జట్టు ఈ దఫా ఫ్లే ఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిదారిపట్టింది. శుక్రవారం రాత్రి ఆ జట్టు ఆడిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో 170కిపైగా పరుగుల తేడాతో విజయం సాధిస్తే ఫ్లే ఆఫ్స్‌లోకి వెళ్లే అవకాశం ఉండటంతో బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత సేపు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ఇషాన్ ముంబై తరపున అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ నమోదు చేశాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఇషాన్ మొత్తంగా 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి క్రీజ్‌లో వున్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. 
 
మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. వీరిద్దరి దెబ్బకు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసుకున్నాడు.
 
ఆ తర్వాత 236 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ధాటిగానే ఆడింది. గత మ్యాచుల్లో ఎప్పుడూ కనిపించనంత జోరు కనబర్చింది. లక్ష్యాన్ని ఛేదించాలన్న కసి హైదరాబాద్ బ్యాటర్లలో కనిపించింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేసి విజయానికి 43 పరుగుల ముందు ఆగిపోయింది.
 
జేసన్ రాయ్ 34, అభిషేక్ శర్మ 33, కెప్టెన్ మనీష్ పాండే 69, ప్రియం గార్గ్ 29 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, కౌల్టర్ నైల్, నీషమ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, బౌల్డ్, పీయూష్ చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాట్‌తో విరుచుకుపడిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముంబై ఇంటి బాట పట్టడంతో కోల్‌కతాకు ప్లే ఆఫ్స్‌లో బెర్త్ ఖరారైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

తర్వాతి కథనం
Show comments