Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ మరో ఎత్తుగడ.. టెలినార్‌ను కైవసం చేసుకునే దిశగా అడుగులు

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్ మరో ఎత్తుగడ వేసింది. దేశ టెలికాం రంగంలో తన మార్కెట్ వాటాను విస్తరించుకునేందుకు వీలుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే తమ వినియోగదా

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (09:23 IST)
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్ మరో ఎత్తుగడ వేసింది. దేశ టెలికాం రంగంలో తన మార్కెట్ వాటాను విస్తరించుకునేందుకు వీలుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే తమ వినియోగదారులను నిలబెట్టుకునేందుకు అనేక ఆఫర్లు ప్రకటించింది. 
 
ఇపుడు నార్వే ఆధారిత టెలికం సంస్థ టెలినార్‌కు చెందిన భారత వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 350 మిలియ‌న్ డాల‌ర్ల టెలినార్ వాటాను కొనుగోలు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందుకోసం టెలినార్‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతోంది. సంస్థలోని సగం వాటాను ప్రస్తుతం కొనుగోలు అనంతరం మిగిలిన సగభాగాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జనవరి చివరికి నాటికి  ఇరు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నివేదికలు తెలుపున్నాయి.  
 
కాగా, టెలినార్‌కు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. అయినా  తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపుల‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వానికి టెలినార్ రూ.1900 కోట్లు, రుణాల రూపంలో బ్యాంకుల‌కు మ‌రో రూ.1800 కోట్లు బ‌కాయి ప‌డింది. దీంతో ఈ రుణ భారంలో సగం చెల్లించ‌డం ద్వారా దానిని సొంతం చేసుకోవాల‌ని ఎయిర్‌టెల్ ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments