ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం...

ఠాగూర్
ఆదివారం, 19 జులై 2026 (16:39 IST)
ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫీడ్‌ లోడ్‌ అవ్వకపోవడం, సందేశాలు వెళ్లకపోవడం, లాగిన్‌ విషయంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫొటోలు, వీడియోల అప్‌లోడింగ్‌లో విషయంలోనూ అంతరాయం ఏర్పడింది. 
 
మెసెంజర్‌ ద్వారా వినియోగదారులు ఎవరికైనా సందేశాలు పంపించడానికి ప్రయత్నించినప్పుడు 'సైట్ సమస్య కారణంగా మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయడమైనది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేవు. కొన్ని నిమిషాల తర్వాత తిరిగి ప్రయత్నించండి' అంటూ సందేశాలు దర్శనమిస్తున్నాయని వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. 
 
భారత్‌ సహా కెనడా, బ్రిటన్‌, తుర్కియే వంటి దేశాల్లోనూ ఈ సమస్య ఎదురైనట్లు డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ సాంకేతిక సేవల్లో అంతరాయంపై మెటా ఇంకా అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా ఇదే తరహాలో ఈ సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

తర్వాతి కథనం
Show comments